NLR: పొదలకూరు మండలంలోని మరుపూరు వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన HP పెట్రోల్ బంకును ఆదివారం సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రారంభోత్సవం చేశారు. పెట్రోల్ బంకు ప్రారంభోత్సవానికి విచ్చేసిన సోమిరెడ్డికి గ్రామ నాయకులు కలిచేటి ప్రభాకర్ రెడ్ది, కలిచేటి శ్రీనివాసులు రెడ్డి ఆధ్వర్యంలో నిర్వాహకులు సోమిరెడ్డికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.