CTR: కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఈ మేరకు సెలవు దినం కావడంతో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు క్యూలైన్లో నిండిపోయారు. అయితే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆలయ ఈవో పెంచల కిషోర్, ఆలయ సిబ్బంది పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు సిబ్బంది పాల్గొన్నారు.