ATP: ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి ఈనెల 12న తాడిపత్రి పట్టణంలో రూ.1.12 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేయనున్నారు. సంజీవ్ నగర్ ఆలయం వద్ద రూ. 34 లక్షలతో అభివృద్ధి పనులు, శ్రీకృష్ణదేవరాయల విగ్రహం వద్ద భూగర్భ డ్రైనేజీ, నంద్యాల రోడ్డులో తాగునీటి పైప్లైన్ పనులకు ఆయన భూమి పూజ చేయనున్నారని నేతలు తెలిపారు.