సత్యసాయి: సోమందేపల్లి మండల కేంద్రంలో నవంబర్ 16న శ్రీకృష్ణదేవరాయల విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా పెనుకొండలో మంత్రి సవితను బలిజ కులస్తులు ఆదివారం కలిశారు. విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం, కార్తీక వనభోజనం మహోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావాలని ఆమెను కోరారు. అనంతరం మంత్రిని సన్మానించి ఆహ్వానపత్రిక అందజేశారు.