KMM: బోనకల్ మండలం నారాయణపురం నుంచి రావినూతల వరకు సుమారు రూ.3.33 కోట్లతో వ్యయంతో చేపట్టనున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులను కాంగ్రెస్ నాయకులు ఆదివారం పరిశీలించారు. కాగా ఇటీవలే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ పనులకు శంకుస్థాపన చేశారు. మండల బీసీ సెల్ అధ్యక్షుడు కందుల పాపారావు, నాయకుడు సూర్య దేవర సుధాకర్‌రావు పనుల పురోగతిని సమీక్షించారు.