GNTR: అభివృద్ధి పనుల్లో తప్పనిసరిగా నాణ్యతా ప్రమాణాలు పాటించాలని కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. పనులు నిర్దేశిత గడువులోగా పూర్తయ్యేలా అధికారులు పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. ఆదివారం ఆయన నగరంలోని బుడంపాడు, ఏటుకూరు, పొత్తూరు ప్రాంతాల్లో పనులను పరిశీలించారు. నిర్మాణ వ్యర్థాలను కాంట్రాక్టరే తొలగించాలని ఆదేశించారు.