TG: గుంటూరు జిల్లా పెద్దకాకానిలో CM చంద్రబాబు పర్యటించారు. ఈ పర్యటనలో శంకర కంటి ఆస్పత్రి భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఐ ఆస్పత్రిలో సూపర్ స్పెషాలిటీ విభాగం ప్రారంభించడం నా అదృష్టం. మళ్లీ స్వర్ణోత్సవాలకు హాజరవుతాను. రోజుకు 750 మందికి ఉచిత కంటి చికిత్సలు అందిస్తున్నారు. ఉచితం అని కాకుండా.. సమర్థంగా సేవలందిస్తున్నారు’ అని కొనియాడారు.