SKLM: గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఏపీ మార్క్ ఫెడ్ డైరెక్టర్ ఆనెపు రామకృష్ణ నాయుడు అన్నారు. ఆదివారం బూర్జ మండలం పెద్ద పేట పంచాయతీ కొత్త ఊరు గ్రామంలో రూ.13.40 లక్షలతో నిర్మించనున్న మంచినీటి ట్యాంక్ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ ట్యాంక్ ద్వారా గ్రామ ప్రజలకు తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారం కానుందని పేర్కొన్నారు.