NGKL: కల్వకుర్తి మండలంలోని మార్చాల జిల్లా పరిషత్ పాఠశాల ఆవరణలో కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జూనియర్, సీనియర్ కబడ్డీ క్రీడాకారుల ఎంపిక కార్యక్రమం ఆదివారం ప్రారంభమైంది. జిల్లా క్రీడల అధికారి సీతారాం నాయక్ ఈ సెలక్షన్ను ప్రారంభించి మాట్లాడారు. గ్రామీణ ప్రాంత క్రీడలను ప్రభుత్వం ఎంతగానో ప్రోత్సహిస్తోందని ఆయన తెలిపారు.