BDK: పాల్వంచ మండలం, వికలాంగుల కాలనీలో న్యాయ అవగాహనా కార్యక్రమంను జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ ఆదేశాల మేరకు ఇవాళ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కొత్తగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్కినేని సత్యనారాయణ మాట్లాడుతూ.. సమాజంలోని బలహీన వర్గాల వారికి, దివ్యాంగులకు న్యాయ సహాయం పొందడంలో ఉన్న హక్కులు, అవకాశాలపై ప్రసంగించారు.