NGKL: జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డులో గల వెంకటేశ్వర స్వామి దేవాలయం (గోవింద క్షేత్రం) అభివృద్ధికి ఎండబెట్లకు చెందిన వంగ వేణు గౌడ్ రూ. 50వేలు విరాళాన్ని అందజేశారు. ఆలయ ఆవరణలో గోవింద క్షేత్ర దేవాలయ ఛైర్మన్ మలిశెట్టి నరసింహకు ఆయన విరాళాన్ని అందించారు. ఈ సందర్భంగా దాతల కుటుంబంపై స్వామివారి కృప ఉండాలని ఛైర్మన్ కోరారు.