ADB: ఆదిలాబాద్ రూరల్ మండలం అంకోలిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. దార్లోద్ది గ్రామానికి చెందిన వంశీ అనే యువకుడికి తలకు తీవ్ర గాయాలు కావడంతో రిమ్స్ ఆసుపత్రి నుంచి మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్ తీసుకెళ్తున్న క్రమంలో మార్గమధ్యలో ఇచ్చోడా దగ్గర మృతి చెందాడు.