వరంగల్ భద్రకాళి అమ్మవారిని ఆదివారం దర్శించుకున్న ప్రముఖ సినీ నటుడు రాజ్ తరుణ్ ముందుగా వల్లభ గణపతిని దర్శించుకుని అనంతరం అమ్మవారిని దర్శించుకున్నారు. వేద పండితులు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో ప్రత్యేకపూజలు నిర్వహించారు అనంతరం అమ్మవారి శేషవస్త్రాన్ని బహుకరించారు ప్రసాదాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ధర్మకర్తలు వీరన్న, పూర్ణచందర్ పాల్గొన్నారు.