GNTR: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరగనుందని కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా తెలిపారు. ప్రజల సమస్యలను స్వయంగా స్వీకరించి పరిష్కార చర్యలు తీసుకోవడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని పేర్కొన్నారు. పరిష్కారం గురించి సమాచారం తెలుసుకోవడానికి టోల్‌ఫ్రీ నంబర్ 1100కు కాల్ చేయవచ్చని వివరించారు.