KRNL: ప్రజల సౌకర్యార్థం బుధవారపేట మెడికల్ కాలేజీ మలుపు విస్తరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కమిషనర్ పీ. విశ్వనాథ్ అధికారులను ఆదేశించారు. ఇవాళ కమిషనర్ బుధవారపేట మలుపు వద్ద రహదారి విస్తరణకు అడ్డంకిగా ఉన్న షాపులు తొలగించిన ప్రాంతాన్ని పరిశీలించారు. R&B శాఖ అధికారులతో సమన్వయం చేసుకుని వెంటనే రహదారి నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించాలన్నారు.