TG: ఇందిరమ్మ రాజ్యమంటూ ఇళ్లు కూలగొడుతున్నారని మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. పేదల బతుకులు కూల్చారంటూ ధ్వజమెత్తారు. హైడ్రా బాధితుల గోడును వీడియోలో ప్రదర్శించారు. హామీలు అమలు చేయని కాంగ్రెస్‌కి బుద్ధి చెప్పాలన్నారు. 10 వేల కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పడ్డారని తెలిపారు. విద్యార్థులను రోడ్డున పడేసే పరిస్థితి వచ్చిందన్నారు.