BDK: రామగుండం 1 ఏరియాలో సీఎండీ ఎన్. బలరామ్ ఆదివారం ఆకస్మిక పర్యటన చేశారు. గుండం-1 ఏరియాలోని కార్మిక కాలనీలు & క్వార్టర్ల స్థితిగతులను ప్రత్యక్షంగా పరిశీలించిన సీఎండి అక్కడి ఉద్యోగులతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు కార్మికులకు క్వార్టర్లలో మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు అవసరమైన చర్యలు వెంటనే చేపట్టాలని ఆదేశించారు.