TG: మరికొంత కాలంలోనే బీజేపీలో BRS పార్టీ విలీనం కావడం ఖాయమని PCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. ‘బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది అయితే.. ఆ రిజర్వేషన్లను అడ్డుకున్న క్రెడిట్ బీజేపీది. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో విజయం కాంగ్రెస్‌ది. ఓటమి భయంతో BRS అసత్య ఆరోపణలు చేస్తుంది’ అని పేర్కొన్నారు.