TG: హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడ రోడ్ షోలో మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కత్తి వాళ్లకు ఇచ్చి యుద్ధం మమ్మల్ని చేయమంటే ఎలా అని నిలదీశారు. కత్తి మాకిస్తే బుల్డోజర్కు అడ్డుగా వెళ్లి ఆపుతామన్నారు. సునీత గెలిస్తే మళ్లీ కేసీఆర్ వస్తారని తెలిపారు. 500 రోజుల్లో కేసీఆర్ ప్రభుత్వం వస్తుందని పేర్కొన్నారు.