NLG: కళ కాసుల కోసం కాదు.. ప్రజలందరి కోసం, పీడిత ప్రజలను చైతన్యవంతం చేసేది ప్రజా నాట్య మండలి అని ఆ సంఘం జిల్లా కార్యదర్శి కుమ్మరి శంకర్ అన్నారు. చిట్యాలలో ఆదివారం జరిగిన ప్రజా నాట్య మండలి మండల మహాసభకు ఆయన హాజరై మాట్లాడారు. పాలకుల ప్రజా వ్యతిరేక విధానాలను తెలుపుతూ.. అన్ని వర్గాల ప్రజా ఉద్యమాలకు బాసటగా నిలిచి కళారూపాలతో ప్రజలకు తెలియజేస్తుందన్నారు.