టాలీవుడ్ హీరో శర్వానంద్, దర్శకుడు శ్రీను వైట్ల కాంబోలో సినిమా రాబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. అయితే ఈ సినిమా ఇదే అంటూ ఓ వార్త బయటకొచ్చింది. తెలియని వయసులో ఆవేశంలో చేసిన ఓ పని కారణంగా హీరో లైఫ్లో జరిగే డ్రామాతో ఇది రాబోతుందట. హీరో జీవితంలో జరిగే సంఘటనలు కూడా చాలా కామెడీగా సాగుతాయని, ఇందులో లవ్ ట్రాక్ కూడా బాగుంటుందని సినీ వర్గాలు పేర్కొన్నాయి.