VSP: మల్కాపురంలోని ఓ బార్లో పనిచేసే యువకుడు నిన్న అర్ధరాత్రి ఆకస్మికంగా మృతి చెందాడు. దత్తిరాజేరు మండలం విజయరాంపురం గ్రామానికి చెందిన గణపతి మల్కాపురంలోని ఓ బార్లో పనిచేస్తున్నాడు. మద్యానికి బానిస కావడంతో అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో బార్ వద్ద మృతి చెందినట్లు స్థానికులు గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసి మృతదేహాన్ని స్థానిక మార్చురీకి తరలించారు.