MBNR: జడ్చర్లలో నకిలీ నోట్ల వ్యవహారం కలకలం రేపింది. శనివారం రాత్రి గంగాపూర్ రోడ్డులోని వెంకటేశ్వర కాలనీలో ఒక వ్యక్తి రూ.500 నకిలీ నోటుతో కిరాణా దుకాణానికి వచ్చాడు. దుకాణ యజమాని గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో, పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతడి వద్ద మూడు నకిలీ రూ.500 నోట్లు లభించినట్లు తెలిసింది.