ATP: గుత్తి గాంధీ సర్కిల్లో ఆదివారం భారీ వాహనాల రాకపోకలతో ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. గాంధీ సర్కిల్ నుంచి రాజీవ్ గాంధీ సర్కిల్ వరకు వాహనాలు నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మరోపక్క గుంతకల్లు రోడ్డులో నూతన రోడ్డు వేస్తున్నారు. దీంతో సంబంధిత అధికారులు స్పందించి ట్రాఫిక్కు అంతరాయం లేకుండా తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.