అమెరికా ప్రభుత్వ షట్‌డౌన్ ప్రభావం విమానయాన రంగంపై తీవ్రంగా పడింది. ఎయిర్ ట్రాఫిక్‌ను తగ్గించాలని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఆదేశాలతో విమానయాన సంస్థలు ఇవాళ 1000కి పైగా విమానాలను రద్దు చేశాయి. దీంతో దేశంలోని ప్రధాన విమానాశ్రయాల్లో గందరగోళం ఏర్పడింది.