కృష్ణా: గుడివాడ రాజకీయాల్లో మాజీ మంత్రి కొడాలి నాని యాక్టివ్ అవుతున్నారు. పలువురు వైసీపీ నాయకుల కుటుంబాలను ఆదివారం పరామర్శించారు. ఇటీవల అనారోగ్య కారణాలతో మృతి చెందిన వైసీపీ నేతల ఇళ్లకు వెళ్లి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మనతో కలిసి పార్టీ, ప్రజల కోసం కష్టపడ్డ నాయకులు ఇక మనలో లేకపోవడం బాధాకరమన్నారు.