బ్రెజిల్లో టోర్నడోలు తీవ్ర విధ్వంసం సృష్టించాయి. టోర్నడోల ధాటికి పలు ఇళ్లు, వాహనాలు ధ్వంసం అయ్యాయి. ఈ భయంకరమైన ప్రకృతి విపత్తులో ఆరుగురు మృతిచెందగా.. వందలాది మందికి గాయాలయ్యాయి. ముఖ్యంగా రియో బోనిటో డో ఇగువాకు అనే పట్టణం అల్లకల్లోలంగా మారింది. దీంతో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.