JN: పాలకుర్తి నుంచి కొడకండ్ల గ్రామానికి వెళ్లే రహదారిపై ఉన్న వాల్మీడీ బ్రిడ్జి ఇటీవలి భారీ వర్షాల కారణంగా శనివారం పూర్తిగా కూలిపోయింది. దీంతో ఆ మార్గంలో రాకపోకలు పూర్తిగా నిలిపివేశారు. ఈ క్రమంలో పాలకుర్తి ప్రధాన కూడలి వద్ద బ్రిడ్జి కూలిపోయినట్లు ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. కూలిన బ్రిడ్జి నిర్మాణాన్ని త్వరగా ప్రారంభించాలని ప్రజలు ఇవాళ డిమాండ్ చేశారు.