BHNG: రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వెంటనే చేనేత రుణాలు మాఫీ చేయాలని మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు డిమాండ్ చేశారు. శనివారం భూదాన్ పోచంపల్లిలో ఏర్పాటు చేసిన చేనేత కార్మిక సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చడం లేదని విమర్శించారు.