KNR: సమాచార హక్కు చట్టం సాధన కమిటీ ఏర్పాటు చేసి సంవత్సరం పూర్తయిన సందర్భంగా హుజురాబాద్ నియోజకవర్గ అధ్యక్షుడు చెరుకు పైడయ్య ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల హక్కుల పరిరక్షణ, పారదర్శక పాలన కోసం కమిటీ నిరంతరం కృషి చేసిందన్నారు. అవినీతి, లంచగొండితనం నిర్మూలించేందుకు పోరాడుతున్నట్లు తెలిపారు.