ATP: ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ చేపట్టిన ‘ప్రజా ఉద్యమం’ ర్యాలీ ఈనెల 12న ఉరవకొండలో జరగనుంది. ఉదయం 9:30 గంటలకు పార్క్ ఆంజనేయస్వామి ఆలయం వద్ద నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ఈ ర్యాలీ కొనసాగుతుందని YCP నియోజకవర్గ ఇంఛార్జి వై. విశ్వేశ్వర రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు పాల్గొనాలని కోరారు.