ATP: అనంతపురం ఆర్డీటీ స్టేడియంలో జరిగిన రాష్ట్రస్థాయి రెవెన్యూ క్రీడా ఉత్సవాలలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె బ్యాట్ పట్టి కాసేపు అలరించారు. ఆమె క్రికెట్ బ్యాట్ పట్టుకోవడంతో అక్కడి వాతావరణం ఉల్లాసంగా మారింది. ఈ సందర్భంగా ఉద్యోగులు, నాయకులు ఆమెను చప్పట్లతో ప్రోత్సహించారు.