BDK: మణుగూరు మున్సిపాలిటీ పరిధిలోని గణేష్ బజార్లో సైడ్ డ్రైన్లు వెడల్పు చేసి, డ్రైన్ ఎత్తు పెంచాలని సీపీఐ పట్టణ కార్యదర్శి దుగ్యాల సుధాకర్ డిమాండ్ చేశారు. ఇవాళ నాడు గణేష్ బజార్‌ను సీపీఐ నాయకులు సందర్శించి సైడ్ డ్రైన్ లు పరిశీలించారు. వారు మాట్లాడుతూ.. సంబంధిత అధికారులు చర్యలు చేపట్టి వెంటనే నిర్మాణ పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు.