MNCL: జన్నారం మండలంలోని వివిధ గ్రామాల శివారులో ఉన్న గోదావరి నది తీరంలో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని, అటు వైపు ఎవరూ వెళ్ళవద్దని స్థానిక ఎస్సై గొల్లపల్లి అనూష సూచించారు. ఆదివారం జన్నారంలో ఆమె మాట్లాడుతూ.. పలు గ్రామాల శివారులలో గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోందని వెల్లడించారు. ఈ నేపథ్యంలో అటువైపుగా వెళ్తే ప్రమాదాలు పొంచి ఉన్నాయని ఆమె హెచ్చరించారు.