NGKL: నల్లమల్ల అటవీ ప్రాంతం మండల పరిధిలోని మన్ననూరు నుంచి పుణ్యక్షేత్రం శ్రీశైలం వరకు కారిడార్ రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు చేసిన విషయం తెలిసిందే. కాగా రూ.8 వేల కోట్లతో కారిడార్ రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం నివేదకలు సిద్ధం చేసింది. 52 కిలోమీటర్ల మీద నిర్మించనున్న ఎలివేటెడ్ కారిడార్ రోడ్ పనుల ప్రతిపాదనలు తుది దశకు చేరినట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు.