NDL: బనగానపల్లె మండలం కొండపేట గ్రామంలో సొంత నిధులతో నిర్మాణం జరుగుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులను ఇవాళ మంత్రి బీసీ జనార్ధన రెడ్డి సతీమణి బీసీ ఇందిరా రెడ్డి స్వయంగా పరిశీలించారు. ఆలయ నిర్మాణ ప్రగతిని పరిశీలిస్తూ, పనులు నాణ్యతతో, వేగంగా పూర్తిచేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. గ్రామస్థులు ఆమె సేవా భావాన్ని ప్రశంసించారు.