TG: బీఆర్ఎస్పై ఎమ్మెల్సీ కవిత సంచలన కామెంట్స్ చేశారు. ‘పార్టీ నుంచి నన్ను చాలా అవమానకరంగా బయటకు పంపారు. ఉరి వేసే ఖైదీనైనా చివరి కోరిక అడుగుతారు. కానీ, నాకు షోకాజు నోటీసు కూడా ఇవ్వకుండా సస్పెండ్ చేశారు. కేసీఆర్ పిలిస్తే కూతురిగా ఇంటికి వెళ్తాను. కానీ, బీఆర్ఎస్కు నాకు సంబంధం లేదు’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.