ATP: గుంతకల్లు కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయంలో ఈనెల 11న హనుమత్ అర్ధమండల దీక్షలు ప్రారంభమవుతాయని ఆలయ ఈవో విజయరాజు ఆదివారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఆలయం వద్ద ఆంజనేయస్వామి దీక్షాపరులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామన్నారు. గత నెల అక్టోబర్ 22న హనుమత్ మండల దీక్షలు పూర్తయ్యాయని తెలిపారు.