NGKL: టైగర్ రిజర్వు ఫారెస్ట్ ఏరియా నల్లమల్ల అటవీ ప్రాంతంలోని అక్కమహాదేవి గుహాల సందర్శనకు అధికారులు మరో లాంచీ ఏర్పాటు చేశారు. ఒకటే లాంచీ ఉండడంతో పర్యటకులు 3 గంటల వరకు వేచి ఉండాల్సి వచ్చేది. ఇది గమనించిన పర్యాటకశాఖ అధికారులు 30 మంది సామర్థ్యం గల మినీ లాంచీని దోమలపెంటకు తీసుకొచ్చారు. త్వరలోనే ప్రారంభిస్తామని ఆదివారం పర్యాటక శాఖ జిల్లా అధికారి నరసింహ వెల్లడించారు.