సత్యసాయి: పెనుకొండలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆదివారం మంత్రులు అనగాని సత్యప్రసాద్, సవిత సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాలు ఆసుపత్రికి వెళ్తే ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ఈ పథకం ప్రవేశపెట్టినట్లు తెలిపారు. CMRF పేద ప్రజలకు ఒక వరంగా పని చేస్తుందని పేర్కొన్నారు.