SRPT: నడిగూడెం మండలం సిరిపురం యువకులు ‘మేలుకో యువత’ అనే నినాదంతో గ్రామాభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నారు. ఆదివారం హైస్కూల్ ఆవరణలో ఉన్న పిచ్చి మొక్కలను తొలగించి క్రీడా వాతావరణం సృష్టించారు. అలాగే తరగతి గదులలో చిన్నపాటి మరమ్మతు పనులు చేపట్టి విద్యార్థులకు అనుకూల వాతావరణాన్ని కల్పించారు. గ్రామంలో అన్ని సమస్యలపై యువత ముందుకు వెళ్తుండటంతో గ్రామస్థులు హార్షం వ్యక్తం చేస్తున్నారు.