అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. దక్షిణాఫ్రికాలో జరగనున్న జీ-20 సదస్సును బహిష్కరిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి అమెరికా నుంచి ఎవరూ హాజరు కాబోరని ప్రకటించారు. సౌతాఫ్రికాలో మైనార్టీలైన శ్వేతజాతి రైతులను చూస్తున్న తీరుపై ట్రంప్ అభ్యంతరం వ్యక్తం చేశారు. కాగా, జీ20 గ్రూప్ నుంచి దక్షిణాఫ్రికాను తొలగించాలని ఇటీవల ట్రంప్ డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.