ADB: జిల్లా రైతుల కోసం మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో మొక్కజొన్న, సోయాబీన్ పంటలను మద్దతు ధరతో కొనుగోలు చేస్తున్నట్టు జిల్లా కలెక్టర్ రాజార్షి షా ఆదివారం తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మద్దతు ధర పొందాలని కలెక్టర్ కోరారు.