NDL: మహానంది మండలం ఎంసీ ఫారం గ్రామం సమీపంలో ఉన్న కాశిరెడ్డి నాయన ఆశ్రమం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు ఇవాళ మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. గాజులపల్లి రైల్వే స్టేషన్లోని నవగ్రహాల ఆలయం వద్ద పనిచేస్తున్న పవన్ పాల కోసం వస్తుండగా బుక్కాపురం గ్రామానికి చెందిన బొలెరో వాహనం ఢీకొట్టినట్లు వారు పేర్కొన్నారు.