అన్నమయ్య: రైల్వే కోడూరులో కొందరు యువకులు మోటార్ సైకిళ్ల సైలెన్సర్లు మార్చి భారీ శబ్దాలు చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. వీరు రైల్వే స్టేషన్ రోడ్డు, శాంతినగర్, చిట్వేల్ రోడ్డు, పాత బజారు, కొత్త బజారు, కడప రోడ్ ప్రాంతాల్లో తిరుగుతున్నారు. ఆదివారం మైనర్లకు స్కూటీలు, బైకులు ఇస్తే తల్లిదండ్రులు బాధ్యత వహించాల్సి ఉంటుందని పోలీసులు హెచ్చరించారు.