నల్గొండ జిల్లాలో కూలీల కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వరి కోతలు, పత్తి ఏరడం ఏకకాలంలో రావడంతో కూలీలకు అధిక డిమాండ్ ఏర్పడింది. మొంథా తుఫాన్ ప్రభావంతో వరి చేలు నేలకొరిగి, కొంత పంట మొలకెత్తింది. కోత మిషన్లు, కూలీలు దొరికినా సమయం ఎక్కువగా పట్టడంతో రైతులు ఆర్థికంగా సతమతమవుతున్నారు.