హాంకాంగ్ సిక్సెస్ 2025 టోర్నమెంట్లో బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియా విధ్వంసం సృష్టించింది. నిర్ణీత 6 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి ఏకంగా 149 పరుగులు చేసింది. ఆసీస్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. దీంతో తొలి క్వార్టర్ ఫైనల్లో ఆస్ట్రేలియా 54 పరుగుల తేడాతో గెలుపొంది సెమీ ఫైనల్కు అర్హత సాధించింది.