ELR: పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు, గిరిజనులకు అండగా ఉండాల్సిన ఐటీడీఏ పీవో కూటమి నాయకులతో కలిసి అవినీతి పాల్పడుతున్నారని ఆదివాసి గిరిజన సంఘం ఆరోపించింది. ఇవాళ బుట్టాయగూడెం(m) గుంజవరం గ్రామంలో గిరిజన సంఘం సమావేశం నిర్వహించినట్లు వారు తెలిపారు. గిరిజనులకి పెద్దదిక్కుగా ఉండాల్సిన అధికారులే అవినీతి ఆరోపణలు ఎదుర్కోవటం బాధాకరమని జిల్లా అధ్యక్షులు రామకృష్ణ అన్నారు.