PPM: కురుపాం మండలం కిచ్చాడా పరిసర గ్రామాల్లో గల అరటి, చెరుకు తోటల్లో ఆదివారం ఉదయం ఏనుగుల గుంపు సంచరించినట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. పరిసర గ్రామాల ప్రజలు, పొలాలకు వెళ్లే రైతులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఏనుగులు కనిపిస్తే ఎటువంటి కవ్వింపు చర్యలకు పాల్పడకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.