అన్నమయ్య: కలకడ మండలం నడిమిచెర్ల పంచాయతీ వడ్డిపల్లికి చెందిన బీసీ మహిళా నాయకులు బత్తిని అలివేలమ్మ ఆకస్మికంగా మృతి చెందారు. ఆమె మృతదేహానికి పీలేరు మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.